తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్…

good news for students education department.

విద్యార్ధులకు గుడ్ న్యూస్

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది  తెలంగాణ సర్కార్. తెలంగాణలోని  పాఠశాలలకు సమ్మర్ హాల్ డేస్ పై ఒక కీలక ప్రకటన చేసింది  సర్కార్ . ఇదే సమయంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్ మెంట్ (ఎస్ఏ)-2 పరీక్షల తేదీల్లో పలు మార్పులు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. ఆయితే ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈ తేదీల లో  మార్పులు తీసుకువచ్చింది సర్కార్. వీటిని రెండు రోజుల పాటు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంబయించున్నారు . మరో వైపు పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు వార్షిక పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి మాసం దాటక ముందే ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున ఏప్రిల్ 17తో పరీక్షలు పూర్తి కానున్నాయి. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 21న వెల్లడిస్తారు. ఏప్రిల్ 24న స్కూల్స్ లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి.  తరవాత ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే సుమారుగా 48 రోజుల పాటు సమ్మర్ హాలీ డేస్ రానున్నాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి.

ఇది కూడా చదవండి :

Leave a Reply