రైతన్నలకు గుడ్ న్యూస్ నేరుగా వారి ఖాతాల్లోకి రూ.2వేలు

Good news for farmers

రైతన్నలకు గుడ్ న్యూస్ నేరుగా వారి ఖాతాల్లోకి రూ.2వేలు 

దేశ వ్యాప్తంగా రైతుఅన్నలు ఎదురు చూపులకు సమయం రానే వచ్చేసింది. అదే పీఎం కిసాన్ 13వ విడత డబ్బుల కోసం ఎదురుచూపులకు తెర పడింది. ప్రధాని నరేంద్రమోదీ కర్ణాటకలోని బెళగావిలో 13వ విడడత డబ్బులను విడుదల చేశారుదేశ వ్యాప్తంగా ఉన్న కోట్ల రైతుల ఖాతాల్లో రూ.2వేల జమ అయ్యాయి. మొత్తం రూ.16,800 కోట్లు విడుదల చేయగా అంతే మొత్తం రైతుల ఖాతాల్లోకి వచ్చేశాయి. వీటిని కర్ణాటకలోని బెళగావిలో మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత నిధుల్ని విడుదల చేశారు పీఎం కిసాన్, జల జీవన్ మిషన్ లబ్దిదారులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింహ్ తోమర్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా ప్రధాని మోదీ వెంట ఉన్నారు.    12వ విడత పీఎం కిసాన్ డబ్బులు గతేడాది అక్టోబర్ లో విడుదల కాగా 4 నెలల తర్వాత 13వ విడత డబ్బును ఫిబ్రవరి 27న విడుదల అయ్యాయి. అయితే వీటిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే.. pmkisan.gov.in అనే వెబ్ సైట్ కి వెళ్లాలి. BeneficiaryStatusపై క్లిక్ చేసి, మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు వచ్చాయే లేదో తెలుస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ వాయిదా 2022 మే నెలలోనూ, 12వ వాయిదా డబ్బులు 2022 అక్టోబర్ నెలలోనూ నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం 2.25 లక్షల కోట్లు ఈ పథకం ద్వారా 11 కోట్లకు పైగా అన్నదాతలకు విడుదలయ్యాయి.పీఎం కిసాన్ సాయం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ.6 వేల సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల మధ్య ఈ నిధులను జమ చేస్తూ వస్తోంది కేంద్రం.

ఇది కూడా చదవండి :

Leave a Reply