గుడ్ న్యూస్ భారీగా తగ్గిన వంట నూనె ధరలు

edible oil became cheap on prices

Oil Prices :భారీగా తగ్గిన వంట నూనె ధరలు

వంట నూనె ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా 30 శాతం వరకు ఆయిల్ రేట్లు పడిపోయాయి. దీంతో ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.హోలి పండుగ నేపథ్యంలో ఇది శుభవార్త అనే చెప్పాలి. మార్కెట్‌లో వంట నూనె డిమాండ్ పైకి చేరినప్పటికీ ఆయిల్ రేట్లు దిగి రావడం గమనార్హం. మార్కెట్‌లో ఆయిల్ ధరలు పడిపోవడం, అదే సమయంలో దేశీ మార్కెట్‌లో ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల దేశీ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగి వచ్చాయి.  గత నెలలో 10 శాతం మేర దిగొచ్చిన వంట నూనె ధరలు ఇప్పుడు ఏకంగా 30 శాతం వరకు తగ్గాయి.

ఏడాది కిందట మస్టర్డ్ ఆయిల్ ధర లీటరుకు రూ. 165 నుంచి రూ. 170 వద్ద ఉండగా, ఇప్పుడు రూ. 135 నుంచి రూ. 140 వద్ద ఉంది. అదేసమయంలో సన్ ఫ్లవర్ ఆయిల్ విషయానికి వస్తే ఏడాది కిందట లీటరు రూ. 135 – రూ. 140గా ఉన్న రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ ఇప్పుడు రూ. 115 – రూ. 120కు దిగొచ్చింది. ఈ గణాంకాలు చూస్తే వంట నూనె ధరలు భారీగా తగ్గాయని చెప్పుకోవచ్చు. లెక్కల ప్రకారం నెల రోజుల్లో ఆవాల నూనె 10 శాతం, సోయాబీన్ నూనె 3 శాతం తగ్గింది. దిగుమతి చేసుకున్న నూనెలలో, ముడి పామాయిల్ ధరలు దాదాపు 30 శాతం తగ్గి లీటరుకు రూ. 95 వద్ద ఉండగా, ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధర 25 శాతం క్షీణించి.లీటరు రూ. 100కు పడిపోయింది. వాస్తవానికి, మనదేశంలో తినదగిన నూనెల ధరలు ఎక్కువగా విదేశీ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకు కారణం ఎక్కువుగా దిగుమతి చేసుకోవడమే.

అయితే రానున్న రోజుల్లో బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో సోయాబీన్, మలేషియాలో పామాయిల్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో అనుబంధించబడిన వ్యాపారవేత్తలు తెలిపారు. అసలు హోలి సందర్భంగా డిమాండ్ పెరినప్పటికీ ధరలు మాత్రం దిగి వచ్చాయని పేర్కొంటున్నారు. దీంతో విదేశీ మార్కెట్లలో ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. దిగుమతి చేసుకునే చమురు చౌకగా మారింది.అలాగే దేశీయంగా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరిగిందని తెలియజేశారు. దీని వల్ల ఆయిల్ ధరలు తగ్గాయని పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి :

తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 యొక్క మొదటి పోస్టర్నుషేర్ చేసిన జాన్వీ కపూర్

Leave a Reply