Amazon layoffs: ‘ఉద్యోగాల తొలగింపు వచ్చే ఏడాదిలో కూడా ఉంటుంది.. ఎంతమంది అనేది ఇంకా నిర్ణయించలేదు’

ఈ ఏడాది 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 20% వరకు తగ్గిస్తున్నట్లు అమెజాన్ CEO ఆండీ జాస్సీ ప్రకటించారు, అయితే ఇది అక్కడితో ఆగదు. కోతలు వచ్చే ఏడాది కూడా కొనసాగుతాయి. ఈ మేరకు బుధవారం తన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. నేను ఈ పోస్ట్‌లో ఏడాదిన్నరగా ఉన్నాను. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాల్లో ఇదొకటి అని ఆయన అన్నారు. గత కొన్ని నెలల్లో, అమెజాన్ వివిధ విభాగాలలో ఖర్చులను తగ్గించాలని నిర్ణయించుకుంది. పొదుపుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు సమీక్షలు నిర్వహిస్తారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొన్ని విభాగాల్లోని కొంతమంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, గత కొన్నేళ్లుగా కంపెనీ చేపట్టిన వేగవంతమైన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జస్సీ తెలిపారు.

ఈ క్రమంలో అమెజాన్ కాలిఫోర్నియాలోని వివిధ విభాగాల్లో సుమారు 260 మంది కార్పొరేట్ కార్మికులను తొలగిస్తున్నట్లు తెలియజేసింది.ఈ వారంలో కార్పోరేట్ వర్క్‌ఫోర్స్‌లో మొత్తం ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తారో కంపెనీ ఇంకా నిర్ణయించలేదని జెస్సీ అన్నారు. సమీక్ష ఫలితాలను బట్టి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని, ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని, కంపెనీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని జెస్సీ తెలిపారు. కాగా ఫేస్‌బుక్ పేరెంట్ మెటా గత వారం 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ట్విటర్‌ కూడా తమ కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను సగానికి తగ్గిస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh