మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. ఏకకాలంలో 50 బృందాల తనిఖీలు..

మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేసింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తోంది.

IT Raids On Telangana Minister Malla Reddy:

హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని మంత్రి, ఆయన కుమారుడు మహేందర్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లలో ఐటీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.

ఐటీ శాఖ పన్ను ఎగవేత విభాగానికి చెందిన దాదాపు 50 బృందాలు మంగళవారం తెల్లవారుజామున కొంపల్లిలోని పామ్ మెడోస్ విల్లాల్లో సోదాలు ప్రారంభించాయి.

రాజశేఖర్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. అతను హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలలో అనేక కళాశాలలను నడుపుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ సోదాల్లో మొత్తం 50 బృందాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల, తెలంగాణలోని మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లల్లో ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మరోమంత్రి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం కలకలం రేపుతోంది.