Pawan KALAYAN:భగత్ సింగ్ గా మారనున్న పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ డేట్స్ ఖరారు అయ్యాయి. ఏప్రిల్ 5 నుంచి భగత్ సింగ్ గా మారనున్నాడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అనౌన్స్ సెకండ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేసుకోని చాలా రోజులు అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయిపొయింది. ఏప్రిల్ 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టిన రోజు కావడంతో పవన్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని పవన్ ఫాన్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎన్నికల తర్వాతే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ అందరికీ స్వీట్ షాక్ ఇస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లే సమయం వచ్చేసింది.
ఈ మొదటి షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు పవన్ కళ్యాణ్ పై సోలో సాంగ్ ను కూడా షూట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ ఈ సినిమా కోసం పెర్ఫెక్ట్ గా షూటింగ్ ప్లాన్ చేశాడు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్స్ ఇచ్చే అవసరం లేకుండా చాలా తక్కువ డేట్స్ లోనే పవన్ కళ్యాణ్ పార్ట్ ను ఫినిష్ చేసేలా హరీష్ శంకర్ డేట్స్ పై కసరత్తులు చేశాడు. తక్కువ రోజుల్లోనే ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాని ఎలా తెరకెక్కించాలి ?, సినిమాలో పవన్ గెటప్ అండ్ లుక్ ఎలా ఉండాలి ? ఇలా చాలా విషయాల్లో హరీశ్ శంకర్ ఆల్ రెడీ పక్కాగా ఫిక్స్ అయ్యాడట.
అన్నట్టు ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ను కూడా స్టార్ట్ చేసాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారైనట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ది హరీష్ శంకర్ ది హిట్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి భారీగా క్రేజ్ రానుంది.
అయితే హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ‘తెరి’కి రీమేక్ వెర్షనా కాదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అభిమానులు కూడా తెరి రీమేక్ అనే విషయాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ కి, నీ స్టైల్ లో సాలిడ్ హిట్ ఇవ్వు అంటూ హరీష్ శంకర్ బీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.
అయితే నిజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ‘తెరి’కి రీమేక్ అయినా సరే మార్పులు, చేర్పులు చేసి మ్యాజిక్ చెయ్యడం ‘మాటలు-మార్పులు’ అంటూ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడంలోనూ హరీష్ శంకర్ కి ‘గబ్బర్ సింగ్’ రూపంలో మంచి హిస్టరీ ఉంది. సో మరోసారి హరీష్ శంకర్ అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.