అత్యంత వైభవంగా ఆది దంపతుల కల్యాణం

సృష్టి పోషణ కర్త అయిన  పరమ శివుడు లింగాకారంలో ఉద్భవించడమే మహా శివరాత్రి  ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం కైలాసంగా విరాజిల్లుతుంది అని ప్రఖ్యాత

సృష్టి పోషణ కర్త అయిన  పరమ శివుడు లింగాకారంలో ఉద్భవించడమే మహా శివరాత్రి  ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం కైలాసంగా విరాజిల్లుతుంది అని ప్రఖ్యాత. ఈ రోజు (శనివారం) లక్షలాది భక్తుల ఓంకార నాదాల మధ్య స్వామివారికి పాగాలంకరణ, అలాగే ఆది దంపతుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం, నంది వాహన సేవ నయనానందభరితంగా సాగింది. సాయంత్రం క్షేత్ర ప్రధాన వీధుల్లో అశేష భక్తజనం నడుమ ప్రభోత్సవం నిర్వహించారు. శివరాత్రి తర్వాతి రోజు జరిగే రథోత్సవ నిర్వహణకు వీలుగా ముందస్తుగా ప్రభోత్సవం జరుపుతారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రభోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. అలాగే ఆలయ వీధుల్లో ప్రభోత్సవం ఘనంగా జరిగింది.  భ్రమరాంబ సమేతుడై మల్లికార్జునుడు నంది వాహనంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారలతో శివ పర్వతులు ఊరేగారు.

ఇది కూడ చదవండి: 

Leave a Reply