నేడు శ్రీవారి దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు

Film and political personalities who visited Srivari today

Tirumala :నేడు శ్రీవారి దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ రోజు (సోమవారం) ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీనటుడు వేణు, తెలంగాణ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అలాగే తిరుమల శ్రీవారిని ఏపీ బిజెపి కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధప్రదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఏపీ బిజెపి కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ల రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి చేందాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు.

కొత్తగా ఏపిలో పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఓట్లను కొనుగోలు చేసే పరిస్థితి రావడం దురదృష్టకరమని చెప్పారు. ఎన్నికల సంఘం ఓట్ల కొనుగోలు సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా మంది ఓటర్లకు సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించి డబ్బుకు బదిలి చేసే సాంప్రదాయం కొనసాగుతుందని ఆరోపణలు చేసారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సాంప్రదాయం ప్రజాస్వామ్యంకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. కఠినమైన నిర్ణయాలతో శాంతిభద్రతలకు ఎటువంటి లోపాలు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంను కోరుతున్నాఅని అన్నారు. ఏపికి పెట్టుబడులు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించరని ఏపికి 13 లక్షల కోట్లల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులు మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టిందన్నారు. పెట్టుబడుల సదస్సు నిర్వహణ అనేది ఎన్నికల దృష్టిలో జరగకూడదని వ్యక్యాణించారు. గతంలోనూ టిడిపి ప్రభుత్వం పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో తీసుకుని పెట్టిందని గుర్తు చేసారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply