బాక్సాఫీస్ నే కాదు సినీ సెలబ్రిటీలు సైతం దసరా పై ప్రశంసల వర్షం

నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ తాజాగా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి సందడి చేస్తోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్‌గా చిత్ర యూనిట్ మలిచిన తీరు థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ వచ్చేలా చేస్తోంది.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్, ఝాన్సి, పూర్ణ కీలక పాత్రలను పోషించాడు. ఈ మూవీతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

‘దసరా'(Dasara) ఒక రివేంజ్ డ్రామా. కథ, కథనం రొటీన్ గా ఉన్నారస్టిక్ బ్యాక్‌ డ్రాప్ సినిమాకి కొత్త ఫ్లేవర్‌ని తీసుకొచ్చింది. నాని, కీర్తి సురేష్ ల నటన, క్లైమాక్స్‌, యాక్షన్ సన్నివేశాలు, బీజీఎమ్, మనసుకు హత్తుకునే ఎమోషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తొలి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ గా దసరాను తీర్చిదిద్దాడు శ్రీకాంత్ ఓదెల.

కాగా, దసరా సినిమాపై ప్రేక్షకులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశాడు. దసరా ఒక స్టన్నింగ్ సినిమా అని.. ఈ సినిమాను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశాడు. దసరా చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. ఇక సూపర్ స్టార్ నుండి ఇలాంటి కామెంట్స్ రావడంతో నాని అండ్ టీమ్ సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. తాజాగా మహేష్ కామెంట్స్‌కు నాని తనదైన రిప్లై ఇచ్చాడు.

మహేష్ నుండి ఇలాంటి కామెంట్స్ రావడం.. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం లాగా ఉందని నాని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం నాని ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ మహేష్ దసరా సినిమాపై చేసిన కామెంట్స్, దానికి నాని రిప్లైని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. దసరా సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

దీంతో మొదటి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభించింది. ఇక టాక్ అనుకూలంగా ఉండటంతో తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 21.00 కోట్ల షేర్‌, రూ. 38.40 కోట్ల గ్రాస్ వసూల్లను రాబట్టి దుమ్ము దుమారం లేపింది. నాని(Nani) కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా దసరా రికార్డు సృష్టించింది. ఇక రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద దసరా బీభత్సం సృష్టించింది.

తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) రెండో రోజు రూ. 5.86 కోట్ల షేర్ ని అందుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 8.08 కోట్ల షేర్ ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 48 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసి రూ. 49 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. 2 రోజుల్లోనే రూ. 29.08 కోట్ల షేర్‌, రూ. 52.40 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 19.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంది

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh