బలగం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?

 

Balagam OTT Release: బలగం సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాన మూవీ ‘బలగం’. ఓ వైపు థియేటర్లలో రిలీజై బాగా చర్చనీయాంశంగా మారి మరో వైపు వివాదంలో చిక్కుకున్నప్పటికీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది అయితే వివాదంలో చిక్కుకున్నప్పటికీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది. స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తెరకెక్కించిన చిత్రం బలగం. జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్‌ హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్‌రెడ్డి బలగం ను తెరకెక్కించారు. చిన్న గా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. వేణు మెగా ఫోన్‌ మొదటిసారిగా పట్టుకున్నా అద్భుతంగా ను తెరకెక్కించాడంటూ మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దైనందిన జీవితాల్లో మాయమైపోతున్న కుటుంబ బంధాలను చక్కగా చూపించారు.

ఈసినిమా  లో చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజైన వారం రోజుల్లోనే లాభాల బాట పట్టింది. అయితే  అసలు ఒకప్పుడు  థియేటర్లలో సినిమా రిలీజైతే ఎలా ఉంది? ఎప్పుడు వెళ్దాం? అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు అందులో నటీనటులు, టాక్ బట్టి థియేటర్లలో చూడాలా, ఓటీటీలో చూడాలా అని డిసైడ్ అవుతున్నారు. విలువుంటే బిగ్ స్క్రీన్ పై చూస్తున్నారు మిగిలిన వాళ్లు మొబైల్లోకి వచ్చాక లుక్ వేసేస్తున్నారు.

అలా సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నీ ఓటీటీలోకి వచ్చేశాయి. ఇప్పుడు అందరికీ ‘బలగం’ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించేసరికి అదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఆ డీటైల్స్ కూడా వచ్చేశాయి.  ‘బలగం’ మూవీ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ విషయం అధికారికంగా ఖరారైపోయింది.  అలాగే ఇకపోతే థియేటర్లలో రిలీజైన నెల తర్వాత అంటే  ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh