బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం

Bandi Sanjay: బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బండి సంజయ్ అత్తమ్మ చిట్ల వనజ సోమవారం ఉదయం మృతి చెందారు.

దీనితో బండి సంజయ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన వనజ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు మృతి చెందారు.

ఆమె మరణవార్త తెలుసుకున్న బండి సంజయ్ హుటాహుటీన కరీంనగర్ కు చేరుకున్నారు. ఆమె పార్ధివదేహాన్ని జ్యోతినగర్ లోని సొంతింటికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి గంగుల కమలాకర్ వనజ నివాసానికి చేరుకొని ఆమె పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. అలాగే కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక బండి సంజయ్  అత్తమ్మ మరణవార్త తెలుసుకున్న బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జ్యోతి నగర్ కు చేరుకుంటున్నారు.

పెను ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని ఈడీ ఎమ్మెల్సీ క‌విత‌ను కోరింది. ఈ క్ర‌మంలోనే క‌విత‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్  విమ‌ర్శ‌లు గుప్పించారు.  కవిత-ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం-అరెస్ట్ విష‌యాన్ని గురించి ప్ర‌స్తావిస్తూ ‘కవితని అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అంటూ  కామెంట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత వికెట్ పడిపోయిందని అతి త్వరలో బీఆర్ఎస్‌లో మరికొంతమంది క్లీన్ బౌల్డ్ అవుతారని అన్నారు. మద్యం కుంభకోణం, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ పై బీఆర్ఎస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. అలాగే, మ‌హిళా క‌మిష‌న్ కు సైతం బీఆర్ఎస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. ఇదే విష‌యంపై బండి సంజ‌య్ స్పందించారు. త‌న‌కు నోటీసులు వ‌స్తే మ‌హిళా క‌మిష‌న్ ముందు హాజ‌ర‌వుతాన‌ని తెలిపారు.

అలాగే తెలంగాణలో  సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ  ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి సిట్ నోటీసులు పంపడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే సమర్పించాలని సిట్ ఆ నోటీసుల్లో కోరింది.

అయితే రెండుసార్లు ఆయనకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. తనకు సిట్ పై విశ్వాసం లేదన్న బండి నా దగ్గర ఉన్న ఆధారాలను నమ్మకం ఉన్న సంస్థలకే ఇస్తానని చెప్పుకొచ్చారు. పేపర్ లీకేజ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అంటున్న బండి సంజయ్ మొదటి నుంచి సిట్ దర్యాప్తును లెక్కలోకి తీసుకోవట్లేదు. అందుకే ఆయన సిట్ అధికారులకు ఆధారాలు ఇచ్చేది లేదంటున్నారు బండి సంజయ్.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh