ప్రౌడ్ ఆఫ్ యు నాన్న అంటూ చరణ్ కి పుట్టిన రోజు విషెస్ చెప్పిన మెగాస్టార్

MGASTAR: ప్రౌడ్ ఆఫ్ యు నాన్న అంటూ చరణ్ కి పుట్టిన రోజు విషెస్ చెప్పిన మెగాస్టార్

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ జన్మదిన మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా  రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహించేందుకు ఆయన అభిమానులు రెడీ అవుతున్నారు. అన్ని దేశాల్లో వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయన అభిమానులు సిద్ధం అవుతున్నారు. రక్తదాన శిబిరాలు, రోగులకు పండ్ల పంపిణీ, వృద్ధులకు దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రాలు చేపట్టబోతున్నారు. ఇక రామ్ చరణ్ కు ఈ పుట్టిన రోజు వెరీ వెరీ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ‘RRR’ సినిమాతో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. ఇక ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ కు అక్కడ ఎంతో గౌరవం లభించింది. అమెరికాలో పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అరుదైన ఛాన్స్ దక్కించుకున్నారు. అంతేకాదు, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు.  హెచ్ సీ ఏ రామ్ చరణ్ ని స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించి గౌరవించింది.మెగాస్టార్ చిరంజీవి  నట వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.

మొదటి సినిమాతోనే తెలుగు సినీ అభిమానులని మెప్పించిన చరణ్, ఆ తర్వాత అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు. నటించింది 15 సినిమాలే అయినా మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు చరణ్. ఇంత తక్కువ సమయంలో ఏ స్టార్ హీరోకి కూడా ఈ రేంజ్ హిట్స్ లేవు. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్… ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ జనరేషన్ లో అందరు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటే రామ్ చరణ్ కి మాత్రం గ్లోబల్ స్టార్ ఇమేజ్ దొరికింది. ఈ విషయంలో ప్రౌడ్ ఫాదర్ గా చిరంజీవి ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ప్రౌడ్ ఆఫ్ యు నాన్న అంటూ ట్వీట్ చేసి మరీ చరణ్ కి పుట్టిన రోజు విషెస్ చెప్పాడు. చరణ్ కి ముద్దు పెడుతున్న ఫోటోని పోస్ట్ చేస్తూ చిరు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. ఈ సాంగ్ లో చరణ్ కనిపించే లుక్ లోనే ఉంది చిరు పోస్ట్ చేసిన ఫోటో. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆప్యాయతని చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh