ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడో తెలుసా

Ambedkar :ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడో తెలుసా

హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులను చేపట్టింది.

ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ గార్డెన్స్ ను ఆనుకొని ఉన్న 36 ఎకరాల్లో దీనికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. 36 ఎకరాల్లో భాగంగా 2 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తున్నారు. మిగతా స్థలంలో మ్యూజియం, సమావేశ మందిరం, అంబెడ్కర్ స్క్వేర్ ను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా ఇది నిలవనుంది. దీని ఎత్తు సుమారు 125 అడుగులు కాగా దీని నిర్మాణం కోసం 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగిస్తున్నారు. ఇక అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇది మణిహారం అవుతుందని భావిస్తుంది.

ఈలోగా అన్ని పనులూ పూర్తిచేయాలని స్పష్టంచేశారు. మంగళవారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్‌ గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, మెయిన్‌ ఎంట్రన్స్‌, వాటర్‌ ఫౌంటెన్‌, సాండ్‌ స్టోన్‌ వర్క్స్‌, జీఆర్సీ, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, లిఫ్ట్‌, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్‌, బిల్డింగ్‌ లోపల ఆడియో విజువల్‌ రూమ్‌, ఫాల్స్‌ సీలింగ్‌ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, వర్క్‌ ఏజెన్సీతో సమావేశమై రోజువారీ పనుల పురోగతిపై చర్చించారు.  దీనికి సంబంధించిన పనులు మొత్తం ఏప్రిల్ 10 వరకు పూర్తి చేయాలనీ ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ విగ్రహాన్ని అంబెడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా కొత్త సచివాలయం, అమరవీరుల స్మృతి వనం, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతాలు టూరిస్ట్ స్పాట్ కానుంది.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh