పెళ్లి పీటలు ఎక్కబోతున్న దేవిశ్రీ ప్రసాద్

DEVISRI PRASAD :పెళ్లి పీటలు ఎక్కబోతున్న దేవిశ్రీ ప్రసాద్

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మొత్తానికి ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. టాలీవుడ్ లో సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఎంతోమంది సంగీత ప్రియులు చెవులు కోసుకుంటారు. కేవలం 17 ఏళ్ల చిన్న వయసులో దేవిశ్రీ..

దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. దేవి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అలాంటి భారీ సినిమాకి చాలా చిన్న వయసులోనే అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వడంతో టాలీవుడ్ సైతం దేవి టాలెంట్ చూసి ఫిదా అయిపోయింది. దేవి సినిమా తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా ఆ తర్వాత మనోడు వెనక్కు తిరిగి చూసుకోలేదు.

స్టార్ హీరోల సినిమాలకు పని చేస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు. తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల నుంచి ఎన్నో రివార్డులతో పాటు అటు అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇక దేవి పని అయిపోయిందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో పుష్పకు అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చి తనను విమర్శించే వాళ్ళ నోర్లు మూయించాడు. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ కి అవకాశం ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం ముందుకు రావడం లేదు. ఎవ్వరు చూసినా సరే తమన్ పేరునే జపిస్తున్నారు. దాంతో దేవిశ్రీప్రసాద్ యొక్క చాప్టర్ క్లోజ్ అనే విధంగానే కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఇక దేవి ఇప్పటికే ముదురు బెండకాయ అయిపోయాడు. దేవి వయసు 43 సంవత్సరాలు.

గత పదేళ్ల నుంచి దేవి పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు వస్తున్నా అవేవీ కార్యరూపం దాల్చడం లేదు. గతంలో హీరోయిన్ ఛార్మితో దేవి ప్రేమలో పడ్డాడని  పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత అది బ్రేకప్ అని గుసగుసలు వినిపించాయి. ఛార్మి పూరి జగన్నాథ్ కు దగ్గర కావడంతో దేవికి దూరమైందని కూడా ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. ఛార్మితో బ్రేకప్ తర్వాత దేవి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ముందుకు వెళుతున్నాడు.

ఇక తాజాగా ఇప్పుడు దేవి పెళ్లి గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. తన బంధువుల్లో ఒక అమ్మాయిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని దేవీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవి వయసు 43 సంవత్సరాలు. దేవికి వరుసకు మరదలు అయ్యే కాబోయే భార్య వయసు 26 సంవత్సరాలు అని తెలుస్తుంది. అంటే దేవి కంటే వయసులో ఆమె 17 సంవత్సరాలు చిన్నది అవుతుంది.

ఇక బంధువులు కావడంతో పాటు ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడాలే కానీ వయసు అంతరంతో పనేముంది ఏదేమైనా ఈసారైనా దేవి ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయితే దేవి అభిమానులకు అంతకుమించిన ఆనందం ఏముంటుంది ?

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh