ఈసారి కొడితే దిమ్మతిరగాలి: జగన్

met ysrcp mlas mps and leaders

ఈసారి కొడితే దిమ్మతిరగాలి: జగన్

ఏపీ సీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు  గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించారు. తక్కువ రోజులు గడపగడపకు నిర్వహించిన ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీయం.  మార్చి 18 నుంచి భవిష్యత్ నువ్వే జగన్ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ ప్రోగ్రాం ద్వారా సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ప్రజల్లోకి వెళ్లాల‌ని స్పష్టం చేశారు. 5.65 లక్షల మంది సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో పార్టీ సైన్యం సిద్ధ‌మైంద‌ని చెప్పారు. వీరు 1.65 కోట్ల గృహాలు సంద‌ర్శించాల‌ని టార్గెట్ జగన్ గారు పెట్టారు. ‘దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నాం. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీ కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే. గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవారు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాలు ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

‘సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా సుమారు 5.65 లక్షల మందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్‌ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్‌ టు డోర్‌ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహ సారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలి’ అని జగన్ ఆదేశించారు.

‘ఇప్పటి వరకూ దాదాపు 7447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహించారు. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించారు. గడప గడపకూ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకం అలాగే నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలి. సుమారు 14 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. టీడీపీకి బాకా ఊదుతున్న వారితోనూ యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్నారు. వీటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు.. అంతా కలిసికట్టుగా పనిచేయాలి’ అని జగన్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh