మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

union minister kishan reddys

మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి(47) కన్నుమూశాడు. గురువారం ఒక్కసారిగా గుండెపోటుకు గురై ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని  హుటాహుటిన కుటుంబసభ్యులు సంతోష్ నగర్ డిఆర్డిఎల్ అపోలో హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మరణించాడు. అతడి మృతితో కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి  కిషన్ రెడ్డి అక్క లక్ష్మి, బావ నరసింహారెడ్డి దంపతుల కుమారుడు జీవన్ రెడ్డి. కిషన్ రెడ్డి అక్క, బావ కుటుంబం ప్రస్తుతం సైదాబాద్ వినయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.

జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. తండ్రి మృతితో కుమారులు కన్నీరుమున్నీరవుతున్నారు. 47 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో మృతి చెందటంతో కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.జీవన్ రెడ్డి అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించ

ప్రస్తుతం కిషన్ రెడ్డి నోయిడాలో ఉండగా మేనల్లుడి మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. మేనల్లుడి మృతితో కిషన్ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక కిషన్ రెడ్డి మేనల్లుడు మరణ వార్త తెలియగానే పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని అనుచరులు, బీజేపీ కార్యకర్తలు  జీవన్  రెడ్డి కి నివాళులు అర్పించారు . తరువాత  కిషన్ రెడ్డిని   పలువురు బీజేపీ నేతలు పరామర్శిస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి జీవన్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

ఇది కూడా చదవండి :

 

 

 

Leave a Reply