తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

telangana government to distribute Medical Kit

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ రోజుల్లో ఏ వ్యాధి సోకినా కానీ ప్రైవేటు ఆసుపత్రిలో మందులు కొనుగోలు చేయాలంటే ప్రతినెల వేలలో ఖర్చవుతుంది. ఈ ఖర్చులను పేద, మధ్యతరగతి ప్రజలు భరించడం కష్టంగా మారింది. ప్రతి కుటుంబంలో వయసు మీద పడిన వారికి దీర్ఘకాలిక సమస్యలైన బిపి, షుగర్ వంటి వ్యాధులు సర్వసాధారణంగా మారిపోయాయి. వీరంతా ప్రతినెనా మెడికల్ షాపులకి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి పేద ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తుంది. ఈ కిట్లలో బిపి, షుగర్ టాబ్లెట్లను ఉంచి వారికి కావలసిన టాబ్లెట్లను ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి అందజేస్తుంది. ఆరోగ్య0  తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దవాఖానాలలో మెరుగైన సేవలు అందించడంతోపాటు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఉచితంగా మందుల కిట్లను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాటను చేసింది. ఎన్సిడి మందుల కిట్ల పేరిట బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా మందుల పంపిణీ చేసేందుకు కిట్లను రూపొందించింది. వీటిని ఇప్పటికే అన్ని దవాఖానాలకు సరఫరా చేసి రోగులకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అసంక్రమిత వ్యాధి నివారణ అదుపునకు గాను ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు మధుమేహాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కిట్లను రూపొందించారు. బిపి, షుగర్ నియంత్రణతో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, కంటి చూపు మందగించడం, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు గురవడం, రక్తనాళాలు దెబ్బ తినడం, పాదాలకు పుండ్లు వంటి దుష్ప్రమైన పరిణామాలు బారిన పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి :

Leave a Reply