ఏపీ ఎన్నికల నేపద్యంలో టీడీపీ కొత్త పొత్తులు

TDP to form new alliances in the wake of AP elections

chadra babu Nayudu  : ఏపీ ఎన్నికల నేపద్యంలో టీడీపీ కొత్త పొత్తులు

ఏపీలో రాజకీయ౦  మరింత రసవత్తరగా మారింది.  వైసీపీ లక్ష్యంగా జనసేన పావులు కదుపుతోంది  ఇప్పుడు జరగబోయే  ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీలు సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి.  ఏపీలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించి, టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ – జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన వైఖరి పైన స్పష్టత లేదు. దీంతో టీడీపీ తమ అభ్యర్ధుల గెలుపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఏపీలో కొత్త పాత్తులు మొదలయ్యాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలవాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం దాదాపు 15 ఏళ్ల తరువాత టీడీపీ మరోసారి వామపక్షాలతో చేతులు కలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారానికి రెండు పార్టీలు అంగీకరించాయి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు టీడీపీ వామపక్షాలు మహా కూటమిగా కలిసి ఎన్నికల్లో పోటీ చేసాయి. ఆ తరువాత తిరిగి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పొత్తు తో ముందుకు వెళ్తున్నాయితమతో కలిసి వచ్చే వామపక్షాలకు టీడీపీ సహకరిస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

అయితే టీడీపీతో ఎన్నికలు- ఓటింగ్ అవగాహన పైన అచ్చెన్నాయుడుతో సహా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పీడీఎఫ్‌ నేత విఠపు బాలసుబ్రహ్మణ్యం తమ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. అధికారికంగా కూడా  ప్రకటన చేశారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని పీడీఎఫ్‌ అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థులకు ఏ రకమైన ఓటూ వేయరాదని స్పష్టం చేసారు. నిరుద్యోగ, ఉద్యోగ వ్యతిరేక వైసీపీ అభ్యర్థులను ఓడించి, రాష్ట్రాన్ని కాపాడుకుందామని టీడీపీ రాజకీయ తీర్మానం చేసిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు విజ్ఞత ప్రదర్శించి పీడీఎఫ్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓటు, టీడీపీ అభ్యర్థులకు రెండో ప్రాధాన్య ఓటు వేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.వైసీపీ అభ్యర్థుల్ని ఓడించడం ద్వారా మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గ ప్రజాస్వామిక హక్కుల్ని కాపాడుకోగలమని పీడీఎఫ్‌ నేత విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply