తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు

pikes The Date of the Inauguration of Telangana's New Secretariat Building

Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు

నూతన సచివాలయ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవనికి  డేట్ పిక్స్ అయ్యింది. ఏప్రిల్ 30న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం నూతన సచివాలయానికి వచ్చిన సీఎం  కేసిర్  గారు అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం సచివాలయం ప్రారంభోత్సవ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు.  అలాగే జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ జరుగనుంది. అలాగే రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఈ భవనం 20 ఎకరాల విస్తీర్ణంలో రూ. 617 కనీవినీ ఎరుగని రీతిలో నూతన సచివాలయ నిర్మాణాన్ని అద్భుతంగా చేపట్టారు.  అత్యంత ఖరీదైన ఫర్నీచర్, అత్యాధునిక వసతులతో, ఎంతో విలాసవంతంగా కొత్త సచివాలయ భవన నిర్మాణం జరిగింది. లోపలికి సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశారు. ఎనిమిది అంతస్తులతో కూడిన భవనంలో ఆరో అంతస్తులో సీఎం సచివాలయం సిద్ధం చేశారు. అయితే ప్రారంభించిన రోజునే తన ఛాంబర్లో కేసీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారని తెలుస్తోంది. అదే రోజు నుంచి నూతన సచివాలయం నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను కొనసాగించనున్నారు.

అసలు నూతన సచివాలయాన్ని సంక్రాంతికే ప్రారంభించాలని ప్రభుత్వం ముందు భావించింది. కానీ అప్పటికి సచివాలయ పనులు ఇంకా పూర్తి కాలేదు. దాంతో పాటు బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాటు, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సచివాలయ ప్రారంభోత్సవం మొదటిసారి వాయిదా పడింది. ఆ తరువాత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికల కోడ్ కారణంగా రెండో సారి ప్రారంభోత్సవం వాయిదా పడింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh