చంద్రబాబు, లోకేష్‌కు కొడాలినాని సవాల్

kodalinani challenges chandrababu lokesh

చంద్రబాబు, లోకేష్‌కు కొడాలినాని సవాల్

ఏపీ టీడీపీ నేత  నారా లోకేష్ మూడు వారాలుగా యువగళం పాదయాత్ర  చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. కొడాలి నాని ఈ రోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమలోనే పుట్టావా అని సీఎం జగన్‌ను లోకేష్ అడుగుతున్నారని.  లోకేష్ ఎక్కడ పుట్టాడని తాము అడిగితే సోషల్ మీడియాలో తమపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నన్నారు.

మరి సీఎం జగన్ రాయలసీమలోనే పుట్టి పెరిగారని నారా లోకేష్ తెలంగాణ లో పుట్టి పెరిగారని తెలిపారు. లోకేష్ తెలంగాణలో పుట్టి, పెరిగి ఏపీలోకి ఎందుకు వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ డీఎన్‌ఏ గురించి ప్రశ్నిస్తున్నారని. ముందు లోకేష్ డీఎన్‌ఎ గురించి చెప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు  13 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి దరిద్రం పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు . చంద్రబాబు ఓ అవినీతి చక్రవర్తి  అని   అవినీతి డబ్బును హెరిటేజ్‌ పెట్టి చంద్రబాబు కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు. జగన్‌ను సైకో అంటోన్న చంద్రబాబే ఓ పెద్ద సైకో అన్నారు.

చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఆయన మామ ఎన్టీఆర్ , చెప్పారని తెలిపారు. సీఎం జగన్ గురించి వ్యక్తిగతంగా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తన అమ్మను ఏదో అవమానించారని లోకేష్ అంటున్నారని.. కానీ చంద్రబాబే తన భార్యను అల్లరి చేశారన్నారు. కావాలంటే అసెంబ్లీ రికార్డును పరిశీలించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. లోకేష్ వాళ్ల అమ్మ మాత్రమే ఆడదా భారతి కాదా అని నిలదీశారు. భారతమ్మ పేరు ఎత్తితే వారి సంగతి చెబుతానని హెచ్చరించారు. ఒకవేళ జగన్ వదిలేసినా తాము వదలే ప్రసక్తి లేదనని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు, లోకేష్‌కు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రావాలి. నా నియోజకవర్గానికి రా నువ్వో నేనో తేల్చుకుందాం  నన్ను లేదా వంశీనో టచ్ చేసి చూడు మీ సంగతి తేల్చుదాం నేను దేనికైనా సిద్దం అంటూ సవాల్ చేశారు కొడాలి నాని.

 ఇది కూడా చదవండి :

Leave a Reply