పవన్ కళ్యాణ్ మూవీ లో యాక్షన్ సీన్స్ షూటస్ డేట్ పిక్స్

 Harihara Veera Mallu :పవన్ కళ్యాణ్ మూవీ లో యాక్షన్ సీన్స్ షూటస్ డేట్ పిక్స్

టాలీవుడ్‌లోని ఏ స్టార్ హీరో అయినా ఏడాది ఒక సినిమా చొప్పున చేయడం చాలా కష్టంగా మారిపోయింది. అలాంటి ఏకకాలంలో నాలుగైదు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకోవడంతో పాటు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు బడా హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోన్న అతడు.. ఇప్పటికే పలు చిత్రాలను అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్ చాలా చిత్రాల్లో నటిస్తున్నాడు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తోన్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో పిరియాడిక్ జోనర్‌లో రూపొందిస్తోన్నారు.
మొగల్ సామ్రాజ్యం నేపథ్యంతో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాకీ పార్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే, పవన్ కల్యాణ్ వేరే చిత్రాల షూట్‌లతో బిజీగా ఉండడంతో దీనికి సరైన సమయాన్ని కేటాయించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి వార్తా తెగ చక్కిరాలు కొడుతుంది.

ఈమూవీ  లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్స్, టీజర్ లో చూపించిన మల్లయోధుల ఫైట్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. కీరవాణి అందించిన బిజియం నెక్స్ట్ లెవల్ లో ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హరిహర వీరమల్లు చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ  మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నెగెటివ్ రోల్‌ను నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ షూట్‌ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి జరపబోతున్నారట. ఇందులో పవన్ కల్యాణ్ – నోరా ఫతేహీ మధ్య కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తారని తెలిసింది. ముఖ్యంగా ఇదంతా కత్తులతో సాగే యుద్ధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాలో వీళ్ల కాంబోపై అంచనాలు క్రమంగా పెరుగుతోన్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh