నేడు వైజాగ్ లో గెలుపు ఎవరది

IND vs AUS: నేడే వైజాగ్ వన్డే

ఆదివారం విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌దే సిరీస్‌.  కానీ   తెలుగు రాష్టాల్లో కురుస్తున్న అకాల వర్షాలు ఆదివారం మ్యాచ్‌పైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే  ప్రస్తుతం పిచ్‌ను కవర్లతో కప్పిఉంచగా మ్యాచ్‌ రోజు ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉంటుంది. అలాగే వర్షం కురిసే అవకాశం 80శాతంగా ఉంటుందని సమాచారం. సహజంగా ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.  ఒకవేళ వర్షం తెరిపిచ్చినట్టయితే 45 నిమిషాల్లో మ్యాచ్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. అవుట్‌ ఫీల్డ్‌పై వున్న తడిని డ్రై చేసేందుకు ఆధునిక సూపర్‌ సాపర్స్‌ మూడింటిని సిద్ధం చేశామన్నారు నిర్వాహకులు.

అలాగే రోహిత్‌ శర్మ రాకతో మరింత బలంగా మారిన టీమిండియా మరింత బలం చేకూరనున్నది. భారత్  విజయమే లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగనుంది.  తొలి వన్డేలో కేఎల్‌ రాహుల్‌, జడేజా ఆల్‌రౌండ్‌షో కారణంగా గెలిచి టీమిండియా ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే  వెనుకబడివున్నా ఆసీ్‌సకు ఈ మ్యాచ్‌  చాలా కీలకంగా మారింది. సిరీ్‌సలో ఆశలు సజీవంగా ఉండాలంటే స్మిత్‌ సేనకు గెలుపు తప్పనిసరి. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ మ్యాచ్‌ చేజారనీయకూడదనే కసితో ఉంది.

తొలి వన్డేలో భారత టాపార్డర్‌ నుంచి మెరుగైన ప్రదర్శన కనిపించలేదు. ఇషాన్‌, విరాట్‌ విఫలం కాగా ఓపెనర్‌ గిల్‌ ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయాడు తాజాగా కెప్టెన్‌ రోహిత్‌ రాకతో జట్టుకు శుభారంభం దక్కుతుందని ఆశిద్దాం. రోహిత్‌ రాకతో ఇషాన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ డకౌట్‌ కావడం నిరాశపరిచింది. టీ20ల్లో నెంబర్‌వన్‌గా ఉన్న సూర్య వన్డే ఫార్మాట్‌లో మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. ఈ ఏడాది ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేదు. ఓవరాల్‌గా అతడి 27 వన్డేల్లో రెండు హాఫ్‌ సెంచరీలే ఉన్నాయి. శ్రేయాస్‌ అయ్యర్‌ గైర్హాజరీలో సూర్య స్థానానికైతే ఢోకా లేదు. ఐదో నెంబర్‌లో రాహుల్‌ మాత్రం అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అందరి చూపు అతనిపైనే ఉండనుంది.

అలాగే గాయం నుంచి కోలుకున్నాక ఆల్‌రౌండర్‌ జడేజా ఫార్మాట్‌ ఏదైనా చెలరేగుతున్నాడు. ఈ ఏడాదే వరల్డ్‌కప్‌ ఉండడంతో జడ్డూ ఫామ్‌ టీమ్‌కు అత్యంత సానుకూలం కానుంది. బౌలింగ్‌లో పేసర్లు షమి, సిరాజ్‌ మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. వైజాగ్‌ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని శార్దూల్‌ స్థానంలో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను తీసుకునే అవకాశం ఉంది. అతను బ్యాటింగ్‌లోనూ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు  కుల్దీప్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.

తొలి వన్డేలో ఆసీస్‌ నలుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగినా ప్రయోజనం లేకపోయింది. వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా ఆడిన మార్ష్‌ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు.  బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై అతను మాత్రం యథేచ్ఛగా షాట్లు బాదాడు. అయితే మధ్య ఓవర్లలో జట్టు తడబడడంతో దన దన  వికెట్లు  కోల్పోవాల్సి వచ్చింది.

ఈ కీలక మ్యాచ్‌లో అలాంటి పొరపాటు చేయకుండా మిడిలార్డర్‌ క్రీజులో నిలవాలనే భావనతో ఉంది. భారత పర్యటనలో స్మిత్‌ ఇప్పటిదాకా అర్ధసెంచరీ సాధించలేకపోయాడు. జట్టు పేసర్లు మాత్రం ముంబై మ్యాచ్‌లో భారత్‌ను ఇబ్బందిపెట్టారు. అందుకే ఆ మ్యాచ్‌లో గెలుపు కోసం భారత్‌ కష్టపడాల్సి వచ్చింది. ఏదేమైనా ఆదివారం వన్డేలో తమ బ్యాటింగ్‌లో లోపాలను సరిదిద్దుకుని ఆసీస్‌ ఎదురుదాడికి దిగాలనుకుంటోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh