MI vs DC IPL 2023: నేడు ఢిల్లీ వర్సెస్ ముంబై కీలక మ్యాచ్
ఐపీఎల్ 16 వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. అయితే టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ ఖాతానే తెరవలేదు. ఎప్పటిలానే ఆరంభ మ్యాచ్ లలో అసాధారణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది.
అయితే తొలి విజయం కోసం ఎదురు చూస్తున్న ముంబై ఆసక్తికర పోరుకు సిద్దమైంది. అరుణ్ జైట్లీ మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబైకి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
ముంబై జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఒక్కరు ఫామ్‌లో లేరు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ దారుణంగా విఫలమవుంటున్నారు. తిలక్ వర్మ ఒక్కడే రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన అతను రెండో మ్యాచ్‌లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
భారీ అంచనాలు పెట్టుకున్న కామెరూన్ గ్రీన్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అండగా నిలబడేవారే లేరు మధ్యలో లలిత్ యాదవ్ 38 పరుగులతో నిలకడగా ఆడినప్పటికి అతను ఔట్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. రెండు మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అయ్యాడు.
దీంతో అతన్ని పక్కనపెట్టి ట్రిస్టన్ స్టబ్స్‌ను ఆడించే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్ గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిందే. ఇదిలా ఉంటే బౌలింగ్ లోనూ ముంబై పూర్తి ఫామ్ అందుకోలేదు.పేసర్లుగా జాసన్ బెహండార్ఫ్, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్ బరిలోకి దిగనుండగా స్పిన్నర్లుగా హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా ఆడనున్నారు. కుమార్ కార్తికేయాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దింపే అవకాశం ఉంది.
మరోవైపు హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన ఢిల్లీ కూడా విజయం కోసం ఎదురు చూస్తోంది. ఎలాగైనా బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ఢిల్లీకి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన సమస్యగా మారింది.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అండగా నిలబడేవారే కరువయ్యారు. మధ్యలో లలిత్ యాదవ్ నిలకడగా ఆడినప్పటికి అతను ఔట్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ 2023లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ముంబై కీలక ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. నేటి మ్యాచ్‌లో వారిపై ఒత్తిడి చాలా ఉంది. ఈ ముగ్గురు రాణిస్తేనే డిల్లీ పై ముంబై గెలవగలదు
ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ మోస్తరుగా ఉన్నప్పటికి బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం సరిగ్గా లేదని చెప్పొచ్చు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ అనుకున్నంత వేగంగా ఆడలేక పోవడం కూడా కొంపముంచింది. కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే విజయం వరిస్తుంది. ముంబై తో మ్యాచ్ లోనైనా ఢిల్లీ బ్యాటింగ్ గాడిన పడకుంటే మాత్రం గెలవడం కష్టమే.
కాగా తొలి మ్యాచ్‌లో ఒంటరిపోరాటంతో ఆకట్టుకోన్న తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ నుంచి అభిమానులు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోన్నారు. ప్రత్యర్థిని కట్టడిచేసే నమ్మకమైన బౌలర్ ముంబైలో లేకపోవడం దెబ్బతీస్తోంది. జోఫ్రా ఆర్చర్‌పై ముంబై ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు.