నటి వైభవి ఉపాధ్యాయ కారు లోయలో పడి మృతి చెందింది.

ప్రముఖ హిందీ టీవీ నటి వైభవి ఉపాధ్యాయ  కారు ప్రమాదంలో కన్నుమూశారు. ‘సారాభాయి వర్సెస్ సారాభాయి’ కామెడీ టీవీ షోలో జాస్మిన్ పాత్రను పోషించి వైభవి ఉపాధ్యాయ గుర్తింపు పొందారు.సీరియల్ ద్వారా పాపులర్ అయిన వైభవి..  హిమాచల్ ప్రదేశ్ లోని బంజర్ లో ఆమె తన కాబోయే భర్త జయ్ సురేశ్ గాంధీతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  ఈ ప్రమాదం మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. వైభవి హఠాన్మరణం ఆమె అభిమానులతో పాటు హిందీ టీవీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఇంత త్వరగా తమను వదిలిపెట్టి వెళ్లిపోవడం ఘోరమంటూ కొందరు టీవీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. వైభవి మృతికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

వైభవికివిహారయాత్రలను ఇష్టపడే వైభవి కొన్నిరోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌ వెళ్లారు. మంగళవారం ఆమె తనకు కాబోయే భర్త జై సురేష్ గాంధీతో కలిసి ఫార్చ్యూనర్ కారులో బయలుదేరారు. ఇద్దరూ కులు జిల్లాలోని బంజర్‌ పట్టణంలో ఉన్న తీర్థన్ లోయ సందర్శనకు బయలుదేరినట్టు సమాచారం. అయితే, బంజర్ సమీపంలోని సిధ్వా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. ఘాట్ రోడ్డులోని వంపు వద్ద అదుపుతప్పిన కారు.. రోడ్డు నుండి 50 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. కారులో ఉన్న వైభవిని పోలీసులు చూసే సరికి ఆమె అప్పటికే మృతి చెందింది. స్థానికుల సాయంతో జే సురేశ్ గాంధీని కారులో నుంచి బయటకు తీశారు. దంపతులు బంజర్ లోని పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బంజర్ షేర్ సింగ్ తెలిపారు.

కాగా, వైభవి కారు ప్రమాదం సమాచారం అందుకున్న ఆమె సోదరుడు హుటాహుటిన ముంబై నుంచి బయలుదేరి బంజర్ వెళ్లారు. వైభవి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు అనంతరం సోదరుడికి అప్పగించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం వైభవి అంత్యక్రియలు నిర్వహించారు.

సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ చిత్రంలో వైభవి ఉపాధ్యాయతో కలిసి పనిచేసిన నిర్మాత, నటుడు జేడీ మజేతియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆమె మృతికి సంతాపం తెలిపారు. జీవితం ఇంత అనూహ్యంగా ఉంటుందంటే నమ్మశక్యంగా లేదని భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ సినిమాలో “జాస్మిన్”గా ప్రసిద్ధి చెందిన ఒక మంచి నటి మరియు ప్రియమైన స్నేహితురాలు వైభవి ఉపాధ్యాయ కన్నుమూశారు.

సారాభాయ్ వర్సెస్ సారాభాయ్తో పాటు, వైభవి ఉపాధ్యాయ క్యా ఖసూర్ హై ఆమ్లా కా, డిజిటల్ సిరీస్ ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్, దీపికా పదుకొణె చిత్రం చపాక్ మరియు 2023 చిత్రం తిమిర్లలో కూడా పనిచేసింది. గుజరాతీ థియేటర్ సర్క్యూట్ లో ఆమె బాగా పాపులర్ అయిన పేరు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh