దేశంలో భారీగా పెరుగుతున్న కరొన కేసులు

 corona virus :దేశంలో భారీగా పెరుగుతున్న కరొన కేసులు

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. చాలా రాష్ట్రాల్లో గతం వారం కంటే ఈవారం కేసులు రెట్టింపుగా నమోదు అయ్యాయి. అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  తెలిపిన వివరాల ప్రకారంబుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం 8 గంటల వరకు కొత్తగా 5,335 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ మహమ్మారి వల్ల 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

దేశంలో కొత్తగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. 194 రోజుల తర్వాత దేశంలో ఒక రోజులో ఇవే అత్యధిక కేసులు కొవిడ్ వైరస్ వల్ల మరో 13 మరణించారు. కొవిడ్​ సోకడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇద్దరు మరణించగా కేరళ, పంజాబ్​లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,929కు చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కు చేరింది. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,39,054 మందికి కొవిడ్​ సోకింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,82,538 కాగా.. రికవరి రేట్​ 98.75గా ఉంది.

ఇప్పటివరకు 220.66 కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు. బుధవారం ఒక్కరోజే 1,60,742 మందికి కొవిడ్ నిర్థరణ పరీక్షలు చేశారు. దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 25 శాతానికి పైగా పెరిగింది.

ప్రస్తుతం దిల్లీలో ఈ రేటు 26.54 శాతానికి చేరింది. గత 15 నెలల్లో ఇదే అత్యధికం. గతేడాది జనవరిలో అత్యధికంగా 30 శాతానికి చేరింది. ఇప్పటివరకు దిల్లీలో 20,12,064 మంది కరోనా బారిన పడ్డారు. బుధవారం ఒక్కరోజే 1,918 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఝార్ఖండ్​లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 51కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,42,661 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్​ నుంచి ఇప్పటివరకు 4,37,278 మంది కోలుకున్నారు. కరోనా వైరస్​ బారిన పడి 5,332 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో బుధవారం 1,177 కరోనా పరీక్షలు చేశారు.

భారత్ లో రోజువారీ పాజిటివిటీ రేటు 3.32%గా రికార్డు అవ్వగా.. వారపు పాజిటివిటీ రేటు 2.89% వద్ద కొనసాగుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.7 శాతంగా, యాక్టివ్ కేసులు 0.06 శాతంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,826 కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 4,41,82,538కి చేరింది. 194 రోజుల తర్వాత ఒక్క రోజులో దేశంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇందులో 95.21 కోట్ల మందికి రెండో డోసు పూర్తవ్వగా.. 22.87 కోట్ల మందికి మెుదటి డోసు కంప్లీట్ అయింది. గత 24 గంటల్లో దాదాపు 1,993 టీకాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 92.23 కోట్ల కోవిడ్-19 టెస్టులు చేశారు. గడిచిన ఒక్క రోజులో దాదాపు 1,60,742 మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న భారత్ లో 4,435 కొవిడ్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh