దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణియం – పవన్ కళ్యాణ్

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని చిందేపల్లిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈసీఎల్ కంపెనీ అక్రమంగా గోడ కట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ గోడను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు . తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు దీక్షకు దిగగా వారికి శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ కోట వినూత మద్దతు నిలిచారు. వారి కోసం ఆమరణ నిరాహారా దీక్షకు దిగాగా పోలీసులు ఆ దీక్షకు అడ్డుకొని వారిని అరెస్ట్ చేయడంతో జరిగింది. దాంతో పోలీసుల తీరుపై జనసేన నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తు ట్విటర్ ద్వారా ఒక సందేశాన్ని తెలిపారు.

శ్రీకాళహస్తి నియాజకవర్గంలోని ఏర్పేడు మండలంలోని చిందేపల్లి గ్రామ రహదారి విషయమై గ్రామస్తులు జనసేన నాయకులు శ్రేణులు మూడు రోజులుగా నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరు ఆక్షేపణియంగా ఉంది ముఖ్యంగా జనసేన నాయకురాలు శ్రీమతి కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరం ప్రజలు పక్షాన గొంతెత్తడమే నేరం అన్నట్లు వై.సి.పి ప్రజా ప్రతినిధులు వ్యూహరచన చేస్తూ అధికార గణాన్ని నడిపిస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్న వారిపై బాల ప్రయోగం చేయడమే కాకుండా వారిపై 307, ఎస్.సి.,ఎస్.టి. ఎట్రాసిటీ యాక్ట్ వంటి బలమైన 14 సెక్షన్ల కకింద కేసు నమోదు చేయడం వెనుక వై.సి.పి పెద్దలు ఉన్నారన్నది సుస్పష్టం.

ఎస్.సి.,ఎస్.టి. ఎట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలంతా అర్దం చేసుకుంటున్నారు. నిన్న అదుపులోకి తీసుకున్న జనసేన నాయకులను ఈ రోజు ఇళ్లకు పంపించారు. అదే విధంగా గ్రామస్తుల కోరిక మేరకు రహదారిని పునరురించాలి. కేసులన్నీ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. చిందేపల్లి వాసులకు జెనసేన భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తునాను” అంటూ పవన్ కళ్యాణ్ ట్విటర్ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు.

కాగా దీక్ష చేస్తున్న వారు పోలీసుల రాకను గుర్తించి దీక్ష చేస్తున్న శివాలయం గర్భ గుడిలోకి వెళ్లి తలుపులు మూసేశారు. దీంతో పోలీసులు గర్భ గుడి తలుపులు తెరిచి బయటకు తీసుకొచ్చారు. జనసేన మహిళా నేత వినూతను అంబులెన్సులో ఎక్కించి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. అదే సమయంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వారు.

 

ఈ సందర్భంగా జనసేన వినూత మాట్లాడుతూ పోలీసుల తీరుపై జనసేన నేత వినూత ఆగ్రహం వ్యక్తం చేస్తు గ్రామస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అక్రమ కేసులు పెట్టి తిరుపతి జిల్లా పరిసరాల పోలీసు స్టేషన్లు తిప్పుతూ అమాయకులను వేధిస్తున్నారు. గ్రామస్తులకు న్యాయం చేయకపోతే చిందేపల్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారు. చిందేపల్లి ఘటనలో 144 సెక్షన్‌లతో పోలీసులు కేసులు పెట్టారు. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తాం. శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తుంటే చెప్పులు, బూట్లతో ఆలయంలోకి పోలీసులు వచ్చారు. ఈసీఎల్ కంపెనీ అక్రమంగా కట్టిన గోడను తొలగించేవరకు పోరు ఆగదు. దశాబ్దాల కాలంగా ఉన్న రోడ్డుకు అడ్డంగా ఈసీఎల్ కంపెనీ కట్టిన గోడకు 200 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh