ఘనంగా డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ వివాహం

ఆర్ఆర్ఆర్ మూవీ  నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ వివాహం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు యావత్ చిత్రసీమ కదిలివచ్చింది. బంధుమిత్రులు ఆశీర్వాదాలు, వేద పండితులు మంత్రాల నడుమ సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. టాలీవుడ్ టాప్ నిర్మాతగా కొనసాగుతున్న దానయ్య ఎంతోమంది స్టార్ హీరోలతో బడా చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్ గా రాజమౌళి, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్‌ నుంచి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో రామ్‌ చరణ్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్లు రాజమౌళి ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ తదితర ప్రముఖులు కల్యాణ్‌- సమతలు పెళ్లి వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. కల్యాణ్ దాసరి కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ‘అధీరా’ ఈ చిత్రానికి ‘ఆ!’, ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకుడు. ఆయనకూ ఇది తొలి పాన్ ఇండియా సినిమా. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇటీవల విడుదల చేసిన అధీరా టీజర్ కూడా హిట్ అయ్యింది.

అధిరా టీజర్ హాలివుడ్ రేంజ్ లో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సినిమా మరియు పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు వేస్తున్నాడు అదృష్టం అంటే అలా ఉండాలని జనాలు అనుకుంటున్నారు. అలాగే డీవీవీ దానయ్య  ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుజీత్‌ డైరెక్షన్‌ అందిస్తున్నాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh