కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్

Ashwin breaks Kumbles record

IND vs AUS:

హ్మదాబాద్‌ వేదికగా టీమిండియాతో జరగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది.  తొలి మూడు టెస్టుల్లో పదునైన బంతులతో ఆసీస్ బ్యాటర్లను తిప్పలు పెట్టిన భారత స్పిన్నర్లు నాలుగో టెస్టులో తేలిపోయారు. పిచ్ నుంచి ఏమాత్రం సహకారం అందకపోవడంతో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో తొలిరోజే భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా రెండో రోజు కూడా అదే జోరు కొనసాగించింది.

ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 150 పరుగులపైగా స్కోరు చేయగా.  యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (114) కూడా శతకంతో ఆకట్టుకున్నాడు.  ఈ జోడీ ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.  ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఎప్పట్లాగే సీనియర్ బౌలర్ అశ్వినినే రోహిత్ నమ్ముకోవాల్సి వచ్చింది. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన అశ్విన్ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక భారత బౌలర్లలో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో అశ్విన్‌ సత్తాచాటాడు. కాగా అతడితో  పాటు షమీ రెండు వికెట్లు, అక్షర్‌, జడేజా తలా వికెట్‌ సాధించారు. అశ్విన్ వేసిన 131 ఓవర్ రెండో బంతికి కామెరూన్ గ్రీన్ అవుటయ్యాడు. అశ్విన్ కూడా చాలా తెలివిగా గ్రీన్‌కు చికాకు కలిగించాడు. దీంతో స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన గ్రీన్ విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతని గ్లవ్స్‌ను ముద్దాడుతూ లెగ్ సైడ్ వెనక్కు వచ్చిన బంతిని కీపర్ కేఎస్ భరత్ చక్కగా అందుకున్నాడు. బంతి స్టెప్ పడగానే లెగ్ సైడ్ జరిగిన భరత్  గ్రీన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా చక్కటి క్యాచ్ పట్టడంతో  గ్రీన్ ఇన్నింగ్స్ ముగిసింది.

అదే ఓవర్లో మరో ప్రమాదకర బ్యాటర్ అలెక్స్ క్యారీ (0) కూడా అవుటయ్యాడు. అతను ఆఫ్ ది మార్క్ సింగిల్ కూడా తీసే అవకాశం అశ్విన్ ఇవ్వలేదు. టైట్ డెలివరీలతో అతనికి చికాకు కలిగించాడు. అలా రెండు బంతులు చాాలా టైట్‌గా రావడంతో క్యారీ తడబడ్డాడు. తను ఒత్తిడి నుంచి బయట పడేందుకు భారీ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే అశ్విన్ వేసిన బంతిని లెగ్ సైడ్ భారీ షాట్ కొట్టేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో బ్యాటు చివర్లో తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని అక్షర్ పటేల్ చాలా సులభంగా పట్టేయడంతో క్యారీ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓవర్లో మిచెల్ స్టార్క్ (6) కూడా అశ్విన్ వలలో పడ్డాడు. ఇది చూసిన నిపుణులు అశ్విన్ బౌలింగ్ బుర్రను తెగ మెచ్చుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా అశ్విన్ ఆటతీరుకు ఫిదా అయిపోయారు.

ఇది కూడా చదవండి: 

Leave a Reply