కలెక్షన్ల లో దూసుకుపోతున్న ‘దాస్ కా ధమ్కీ

Das Ka Dhamki: కలెక్షన్ల లో దూసుకుపోతున్న ‘దాస్ కా ధమ్కీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నిర్మాత కూడా విశ్వ‌క్ సేన్ కావ‌టం విశేషం. ఆయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 22వ తేదీన విడుదలైంది. అయితే ముందుగా నరేశ్​ అనే మరో దర్శకుడితో ఈ సినిమా ప్రారంభించారు విశ్వక్​ కానీ ఎందుకో నరేశ్​ సరిగ్గా సినిమాను డీల్ చేయడం లేదనిపించి ఆయనను తప్పించి విశ్వక్​ సేన్ మెగా ఫోన్ పట్టుకున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాను సొంత డబ్బులు పెట్టి నిర్మించారు విశ్వక్​.

విశ్లేషకుల నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు మాత్రం క‌లెక్ష‌న్స్ రూపంలో సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అన్నీ క‌మర్షియ‌ల్ హంగుల‌తో ట్విస్టులు, ట‌ర్నుల‌తో ‘దాస్ క‌దా ధ‌మ్కీ’ తొలి రోజున సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. మొత్తంగా ‘దాస్ క‌దా ధ‌మ్కీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.7.50 కోట్లు జ‌రిగాయి. రూ.8 కోట్లు వ‌స్తేసే సినిమా హిట్ అని ట్రేడ్ వ‌ర్గాలు భావించాయి.  అయితే సినిమా మాస్ ఆడియెన్స్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. ఊహించిన దాని కంటే ఎక్కువ‌గానే క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. విశ్వ‌క్ గ‌త సినిమాల కంటే ఈ సినిమా చాలా ఎక్కువ‌గా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ మూవీకి తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.8.2 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. అయితే సినిమా టీమ్ మాత్రం రూ.8.8 కోట్లు వచ్చినట్లు తెలియజేసింది.

ఈ సినిమా వసూళ్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్​టాపిక్​గా మారాయి. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్​ ఈవెన్​ పూర్తి చేసుకుంది. అలాగే  ప్రస్తుతం టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. ఎవరూ ఊహించని విధంగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది.

ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి రోజు ఈ సినిమా రూ. మూడు కోట్ల ఆరు లక్షలు వసూలు చేసింది. రెండో రోజు రూ.కోటి ఐదు లక్షలు, మూడో రోజు రూ.కోటి రెండు లక్షలు, నాలుగో రోజు రూ.కోటి 22 లక్షల వసూలు చేసింది. శనివారం కావడంతో నాలుగో రోజు వసూళ్లు కలిసి వచ్చాయి. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.ఆరు కోట్ల 35 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా సుమారు రూ.11 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh