ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన పునీత్ ఆఖరి సినిమా ఎప్పుడో తెలుసా ?

Puneeth Rajkumar:

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన పునీత్ ఆఖరి సినిమా ఎప్పుడో తెలుసా ?

కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్‌లో గుండెపోటుతో కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే పునీత్ రాజ్ కుమార్ మృతి ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. అయితే ఆయన ఎలా చనిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మరణించాడా అప్పుడు రకరకాలు ప్రశ్నలు  అందరి మదిలో తలెత్తయి. అయితే పునీత్‌ చనిపోయేనాటికే ఆయన చేతిలో పలు సినిమా లు ఉన్నాయి. దీంతో వాటి రిలీజులపై సందిగ్ధం ఏర్పడింది.

అయితే పునీత్‌పై అభిమానంతో దర్శక నిర్మాతలు ఎలాగోలా అన్ని సినిమా లు పూర్తి చేశారు. అలా పునీత్ కన్నుమూశాక రిలీజైన జేమ్స్‌, లక్కీమ్యాన్‌ లు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఈలోకంలో లేని పునీత్‌ను సిల్వర్‌ స్ర్కీన్‌పై చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఇక  పునీత్‌ చివరిగా నటించిన చిత్రం గంధడ గుడి. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ వైల్డ్‌ లైఫ్‌ డాక్యుమెంటరీని పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష తెరకెక్కించారు. పవర్‌ స్టార్‌ సతీమణి అశ్విన్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నిర్మాతగా వ్యవహరించారు. గతేడాది పునీత్‌ వర్ధంతి (అక్టోబర్‌ 22) సందర్భంగా విడుదలైన గంధడ గుడి కు ప్రేక్షకులు పోటెత్తారు. అలాగే థియేటర్ల వద్ద పూజలు, పెద్ద ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. కాగా స్వయానా ప్రకృతి ప్రేమికుడైన పునీత్‌ ఇందులో కూడా అదే పాత్రను పోషించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన గంధడ గుడి డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్ వీడియో గంధడ గుడి డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈక్రమంలో పునీత్‌ జయంతి సందర్భంగా రేపు (మార్చి 17) నుంచి ఈ ను స్ట్రీమింగ్‌ చేయనుంది. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం డబ్బింగ్‌ వెర్షన్‌ల మాత్రం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సదరు ఓటీటీ సంస్థ. మరి పునీత్‌ ఆఖరి సారి నటించిన ఈ గంధడ గుడి ను ఎంచెక్కా ఇంట్లోనే కూర్చోని ఎంజాయ్‌ చేయండి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh