ఒకే కాన్పులో నలుగురు పిల్లకు జన్మనిచ్చిన మహిళా

Four in Single Birth:  ఒకే కాన్పులో నలుగురు పిల్లకు జన్మనిచ్చిన మహిళా

ఒక్క కాన్పులో ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టడం సాధారణమైన విషయమే. కొన్నిసార్లు ముగ్గురు, నలుగురు కూడా పుట్టడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు.  అయితే మొదటి కాన్పులో ఆమెకు ఓ బాబు కాగా అతనికి 9 ఏళ్లు. ఇప్పుడు రెండో కాన్పులో తొలుత బాబు, తరువాత పాప, అనంతరం మరో ఇద్దరు బాబులు జన్మించారు.  కుటుంబసభ్యులను ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. తల్లీ పిల్లలు అందరూ క్షేమంగా ఉండటంతో.. కుటుంబసభ్యులకు టెన్షన్ తప్పింది.అయితే  తల్లితో పాటు పుట్టిన నలుగురు పిల్లలు కూడా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వీరికి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు.ఈ కాన్పు చేసిన పీపుల్స్ ఆస్పత్రిలో గతంలోనూ.. ఇలాంటి అరుదైన ఘటనలు చాలా జరగటం గమనార్హం. అరుదైన ఆపరేషన్లను విజయవంతంగా చేయటం.. పీపుల్స్ ఆస్పత్రిలో తరచూ జరుగుతుంటుంది. ఆస్పత్రిలోని డాక్టర్ శంకర్ ఇలాంటి శస్త్రచికిత్సలు చేయటంలో.. సిద్ధహస్తునిగా పేరుగాంచారు. ఈ కాన్పుతో పీపుల్స్ హాస్పిటల్ మరోసారి వార్తల్లో నిలిచింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh