ఏపీ సిఎం పర్యటనలో బాలినేని ఆగ్రహం

MARKAPURAM TOUR:జగన్  పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు (బుధవారం) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఈబీసీ నిధులను విడుదల చేయనున్నారు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు . అయితే సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు, అధికారులు మార్కాపురం చేరుకున్నారు. మాజీ మంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి మార్కాపురం వచ్చారు. సీఎంను రిసీవ్ చేసుకోవడానికి హెలిప్యాడ్ దగ్గరికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు దీంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని తనకు సీఎం కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వకపోవడం.ఆయన కార్యక్రమానికి హాజరుకాకుండానే బాలినేని  ఒంగోలు వెళ్లిపోయారు. బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే ఆయన  వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే చెప్పినా బాలినేని వినలేదు.. వెనక్కు తగ్గకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బాలినేని సభకు రాకుండా వెళ్లిపోవడంతో సీఎం జగన్ ఆరా తీసినట్లు తెలిసింది.  అసలు స్థానిక పోలీసులే అయినా బాలినేనికి ఎందుకు గౌరవం ఇవ్వలేదు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలినేని అనుచరులు సైతం పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.ఇదిలా ఉంటే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రి వెనక్కు వచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కాపురంలో హాజరైన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో ఈ ప్రోటోకాల్ వివాదంకు ముగింపు పలికారు.

బాలినేనికి పూర్తిగా వైసీపీలో ప్రాధాన్యత పడిపోయింది. పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదని తెలియడంతో టిక్కెట్ ఇచ్చేది లేదని జగన్ ముందే చెప్పారని అంటున్నారు. అందుకే ఓ సారి తన భార్యకు మరోసారి తన కొడుక్కి ఇస్తారని చెబుతున్నారు. ఎవరికి ఇస్తారన్నది మాత్రం స్పష్టత లేదు.

మరో వైపు ప్రకాశం జిల్లా నుంచే తన కుటుంబం నుంచే ఆయన మరో నేత నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. గతంలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారాలూ జరిగాయి. ఇప్పుడేం చేస్తారో చూడాల్సి ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh