అభిమాని ఫోన్ పగులగొట్టేస్తానని బెదిరించిన నయనతార

Nayanthara-Vignesh:అభిమాని ఫోన్ పగులగొట్టేస్తానని బెదిరించిన నయనతార

తమిళ స్టార్ సీనియర్ నయనతార  ఆమె భర్త తమిళ దర్శకుడు  విఘ్నేష్  శివన్ దంపతులు చెట్టాపట్టాలు వేసుకుని తెగ తిరిగేస్తున్నారు. విహారయాత్రలు.. ఆధ్యాత్మిక యాత్రలు ఏవీ వదలకుండా జంటగాసందడి చేస్తున్నారు.  గత ఏడాది స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుని.. అదే ఏడాది అక్టోబర్ 9న సరోగసీ విధానం ద్వారా  కవల పిల్లలకు వీరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కాగా ఆ పిల్లలకు రీసెంట్ గా నామకరణాలు కూడా చేసి వారి పేర్లను ప్రకటించారు నయన్ దంపతులు. ఉయిర్ రుద్రోనీల్ ఎన్.శివన్, ఉలగ్ దైవీక్ ఎన్.శివన్ అనే పేర్లు ఇద్దరు పిల్లకుపెట్టినట్టు వారు వెల్లడించారు. వారి గురించి ప్రత్యేక పూజా కార్యక్రమంలు కూడా చేయిస్తున్నారు తమిళ స్టార్ కపుల్.

అయితే ఈ క్రమంలో   తమ కులదైవాన్ని దర్శించుకున్నారు నయన్ దంపతులు తంజావూర్ జిల్లా పాపనాశం సమీపంలోని కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా తమ పిల్లల నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ పిల్లల శ్రేయస్సు కోసం  తమ జీవితంత పాటు తాము నటించే సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించారు జంట

అయితే లేడీ సూపర్ స్టార్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో దర్శనం అనుకున్న విధంగా జరగలేదు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కూడా నానా తంటాలు పడ్డారు. పూజ పూర్తయిన తర్వాత ఇద్దరూ మరో ఆలయానికి వెళ్తారు.

ఈ సమయంలో నయనతారకు ఓ అభిమానితో చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత మరో ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైల్వేస్టేషన్ లో వారికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. దీంతో విశ్వాసం నటి సహనం కోల్పోయి తనను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన అభిమాని ఫోన్ పగులగొట్టేస్తానని బెదిరించింది. నయనతార  చివరిసారిగా కనెక్ట్ లో కనిపించింది ఈ హారర్ డ్రామాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు. తలైవి ప్రస్తుతం జవాన్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. షారుఖ్ ఖాన్ నేతృత్వంలోని ఈ యాక్షన్ చిత్రం బాలీవుడ్ అరంగేట్రం చేసింది. దీనికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ప్రియమణి నటిస్తున్నారు. జవాన్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార చేతిలో ఇరైవన్ కూడా ఉంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh