Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో

Rahul Gandhi తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రెండు రోజుల్లో

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో పదో రోజు ప్రారంభమైంది. నేడు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు యాత్ర కొనసాగింది. 21 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. మరో రెండు రోజుల్లో తెలంగాణలో జోడోయాత్ర ముగియనుంది. కాగా కన్యాకుమారి నుంచి 58 రోజులుగా కొనసాగుతున్న జోడోయాత్ర కశ్మీర్ వరకు చేరుకోనుంది.

2.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.

ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఆ ఉద్యోగుల పిల్లలకు కూడా సంవత్సరానికి రూ.2,500 వరకు బోధనా రుసుములు చెల్లించాలని నిర్ణయించింది. LKG నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలకు బోధనా రుసుములు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇద్దరు పిల్లలకు ఈ స్కీం వర్తించనుంది.

 

3.వాహ్వా.. నీ యాక్టింగ్కి ఆస్కార్ కూడా తక్కువే!

మునుగోడులో ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ స్టేషన్లోకి ఓ పార్టీ నేత మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆ విషయం గమనించిన పోలీసులు ఫోన్ అడగడంతో ఫోన్ వేరే వ్యక్తికి విసిరి, అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఆ తర్వాత తనను పోలీసులు చంపాలని చూస్తున్నారని, కాపాడంటూ ఏడుస్తూ.. ఓటర్ల దగ్గరికి వెళ్లి యాక్టింగ్ మొదలుపెట్టాడు. కాగా.. ఆ వ్యక్తి బీజేపీ నేత అని టీఆర్ఎస్ వాళ్లు వీడియోను షేర్ చేస్తున్నారు.

4.కేసీఆర్ పాలనలో ప్రజలకు కష్టాలే అన్న షర్మిల

సీఎం కేసీఆర్ తన ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలకు కష్టాలు ఇవ్వడం మినహా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని YSRTP రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల విమర్శించారు. ఏడాది క్రితం ఆమె ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ సమీపంలో 3వేల కిలోమీటర్లకు చేరింది. ఈ సందర్భంగా దొనబండలో విజయమ్మతో కలిసి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

5.చిరుత దాడి

కర్ణాటక మైసూరులో చిరుతపులి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. ఓ కుక్కను వేటాడుతున్న చిరుత బైకుపై వెళ్తున్న వ్యక్తిపై ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. దాన్ని తరిమేందుకు రాళ్లు విసిరిన మరో వ్యక్తిపైనా అటాక్ చేసింది. చివరకు అటవీ అధికారులు దాన్ని పట్టుకున్నారు.

6.రాష్ట్రంలో ఈశాన్య గాలులతో చలి TS:

ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటివేళ పొడి వాతావరణం ఉంటోంది. హైదరాబాద్, నల్గొండలో గాల్లో తేమ సాధారణం కన్నా 10 నుంచి 13శాతం తక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉంది.

7.హైదరాబాద్లో కార్గో-పార్టనర్ కార్యాలయం

ఆస్టియా కేంద్రంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్న కార్గో తన కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. లాజిస్టిక్ హబ్ గా పేరున్న ఇక్కడ తమ విస్తరణ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. చిన్న, మధ్య తరహా కంపెనీలకు లాజిస్టిక్స్ సేవలు అందించడంలో ఇబ్బందులున్నాయని, అందుకే మెరుగైన సేవలను అందించేందుకు ఇక్కడ కార్యాలయం ప్రారంభించినట్లు వెల్లడించింది. అవసరమైన మేరకు నిపుణులను నియమించుకోనున్నట్లు పేర్కొంది.

8.రిటర్నులకు నో చెబుతున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్… జర భద్రం.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్. ఈ రెండూ దేశంలోనే రెండు అగ్రగామి ఈ కామర్స్ సంస్థలు. అంతేకాదు, మరో బలమైన సంస్థ అన్నదే లేకుండా, ఈ రెండూ వేటికవే పోటీ పడుతూ భారత వినియోగదారుల గడపలను చేరిన అమెరికా కంపెనీలు. వీటిల్లో ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేసి, డెలివరీ అయిన తర్వాత నచ్చకపోతే ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం. చెల్లించిన డబ్బు వాపసు వస్తుంది. డెలివరీ అయిన ఉత్పత్తి నాణ్యత నాసిరకంగా ఉంటే? డ్యామేజ్ అయితే? చెప్పిందొకటి, పంపింది మరొకటి అయితే? ఇలా ఎన్నో కారణాలతో కస్టమర్లు వాటిని రిటర్న్ చేయవచ్చు.

ఈ సౌకర్యం వల్లే కోట్లాది మంది భారతీయులు ఈ ప్లాట్ ఫామ్ లలో షాపింగ్ కు అలవాటు పడ్డారు.కానీ, ఇకపై ఈ సౌలభ్యం ఉండదని గుర్తు పెట్టుకోవాలి. సరైన కారణం లేకుండా రిటర్న్ చేస్తే.. మీ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సరైన కారణాలున్నా, ఎక్కువ రిటర్నులు వచ్చినా అంతే. దీనికి ఈ సంస్థలు చెబుతున్న కారణం ఒక్కటే. రిటర్నుల కారణంగా తాము భారీగా నష్టపోతున్నామని. ఈ సంస్థలు గతంలో మాదిరి భారీ డిస్కౌంట్స్ ఏమీ ఇవ్వడం లేదు. అయినా కానీ, నష్టాలను సాకుగా చూపిస్తూ భారత మార్కెట్లో పరోక్ష లాభాలు పెంచుకునేందుకు స్ట్రాటజీ 2.0 లేదా తదుపరి వ్యాపార వ్యూహానికి తెరతీశాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.

9.సెమీస్ బెర్త్ ఖరారు చేసే మ్యాచ్

టీ20 ప్రపంచకప్ లో గ్రూప్-1 నుంచి మరో జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు చేసే మ్యాచ్ ఈరోజు ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరగనుంది. టాప్ 2లో ఉన్న ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి.. తాను సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచి తీరాల్సిందే. ఒకవేళ గెలిస్తే ఆస్ట్రేలియాతో సమంగా 7 పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్తో ఇంగ్లాండ్ సెమీస్ వెళుతుంది. ఓడితే ఆసీస్ సెమీస్లో అడుగుపెడుతుంది. శ్రీలంకకు ఎలాగూ ఛాన్స్ లేదు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh