Telangana: అదృశ్యమైన చిన్నారి కథ విషాదాంతం?

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ చెరువు వద్దకు వెళ్లిన పదేళ్ల బాలిక అదృశ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తరువాత చెరువులో ఒక మృతదేహం కనుగొనబడింది మరియు భద్రతా కెమెరాల ఫుటేజీ ఆధారంగా, బాలిక స్వయంగా అక్కడికి వెళ్లిందని భావిస్తున్నారు.

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన పదేళ్ల ఏళ్ల చిన్నారి ఘటన విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహన్ని కనుగొన్నారు. ఇందు మృతిపై బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్‌ తమ పాపను ఏదైనా చేయకూడనిది చేసి దమ్మాయిగూడ చెరువులో పడేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

నాల్గవ తరగతి చదువుతున్న ఇందు అనే చిన్నారి గురువారం తప్పిపోయింది. డిసెంబర్ 15వ తేదీ ఉదయం పాప తండ్రి దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాల వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్లగా.. ఆ తర్వాత నుంచి పాప కన్పించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభించింది.

వివరాల్లోకి వెళ్తే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కి చెందిన 4వ తరగతి విద్యార్థిని ఇందు గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లిన తర్వాత.. ఆడుకుంటానని బయటకి వెళ్లి అదృశ్యం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే వెంటనే తెలియజేయాలని ప్రసార, సామాజిక మాద్యమాలు ద్వారా ప్రచారం చేశారు. అయినా ఆచూకీ లభించలేదు. చివరికి బాలిక మృతదేహం లభించింది.

Dimple Hayathi In Shankars Movie keerthi suresh