Kalyan ram : మరో స్టన్నింగ్ లుక్ లో కనపడనున్న కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా బింబిసార మంచి వసూళ్లు రాబట్టింది. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి ఎట్టకేలకు బింబిసారా తో హిట్ సినిమా వచ్చింది. నూతన దర్శకుడు వశిష్ఠ బింబిసారుడి జీవిత కథ ఆధారంగా సోషియో-ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా డెవిల్. ఆమధ్య కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా డెవిల్ రిలీజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పీరియాడిక్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్ర‌జ‌లు చాలా ఎక్స‌యిటింగ్‌గా ఉన్నారు.

ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటుండగా, త్వరలో రానున్న డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. భారతదేశంలో బ్రిటీష్ పాలనలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ దీని తో పాటు బింబిసార పార్ట్ 2 చిత్రాన్ని మొదలు పెట్టడం కోసం సన్నాహాలు చేస్తున్నారు. మొదటి సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో పార్ట్ 2 కూడా అంతే విజయం సాధిస్తుందని కొందరు అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!

Dimple Hayathi In Shankars Movie keerthi suresh