హైదరాబాద్ వాసులకు మరో 10 రోజుల పాటు తప్పవు తిప్పలు

hyderabad/traffic-restrictions-in..

హైదరాబాద్ వాసులకు మరో 10 రోజుల పాటు తప్పవు తిప్పలు

హైదరాబాద్ లో గడిచిన మూడు రోజులుగా భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్తే.. గమ్యస్థానికి ఎప్పుడు వెళ్తామో చెప్పలేని పరిస్థితి. నిత్యం రద్దీగా ఉండే  ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది.ముఖ్యంగా  చెప్పాలంటే మంగళవారం, బుధవారం నగరంలోని చాలా ప్రాంతల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపించింది. ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే ఈ నేపద్యం లో ఈ రోజు నుంచి  హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో  నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. అంబర్‌పేటలో ఈ నెల 30 నుంచి మార్చి 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. అయితే లంగర్ హౌస్ దగ్గర నేడు ఒక్కరోజు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేసింగ్ పోటీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఉంటుంది. అంతేకాదు ఫిబ్రవరి 17న కొత్త సెక్రటేరియెట్ ప్రారంభ కార్యక్రమం, ఫిబ్రవరి 19న శివరాత్రి వేడుకలు జరగనున్నాయి. వరుస కార్యక్రమాల సందర్బంగా  నగరంలో మరో 10 రోజుల పాటు ట్రాఫిక్ సమస్య ఇలాగే ఉండే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రూట్లలో ప్రతి రోజూ ట్రాఫిక్ ఉంటుంది. ఆ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలను చూసుకోవాలి. లేదంటే ట్రాఫిక్‌లో గంటల కొద్ది నిలిచిపోవచ్చు.

జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 80 లక్షల వరకు వాహనాలుంటాయి. ఇందులో 30 లక్షల వాహనాలు నిత్యం రాపోకలు సాగిస్తాయి. ఆఫీసులు, పనులకు వెళ్లే వారితో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్య ఉంటుంది. 10 కిలోమీటర్లు వెళ్లాలంటే,  దాదాపు 45 నిమిషాల వరకు సమయం పడుతుంది.  కానీ గడిచిన  మూడు నాలుగు రోజులు  నుంచి   10 కిలోమీటర్ల దూరం వెళ్లే వారికి ఏకంగా గంట సమయం పడుతోంది. రోడ్డుపైకి వచ్చే వారిలో చాలా మంది ట్రాఫిక్ నిబంధనలను పాటించడం లేదని. ఈ కారణం వల్లే నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని నగరవాసులు వాపోతున్నారు.

అసలే  ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేసింగ్ అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు దాదాపు 22 వేల మంది వరకు ప్రేక్షకులు వస్తారని అంచనా ఉంది. ఈ తరుణంలో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కన ఉన్న ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియెట్, తెలుగుతల్లి మార్గాలను మూసివేశారు.నగరంలో ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీగా ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ సాధారణం కన్నా ఇప్పుడు వాహనాల రాకపోకలు పెరగడంతో  ట్రాఫిక్‌ను అదుపుచేయడం వారికి ఇబ్బందిగా మారంది. ఈ నేపథ్యంలో రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలు కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. అంబర్‌పేటలో ఎన్‌హెచ్ 163పై ఫ్రై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. జంక్షన్ నెంబర్ 6 వైపు జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఉప్పల్ నుంచి వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ క్రాస్ రోడ్డు, తార్నాక, ఉస్మానియా దూర విద్యా రహదారి, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలియద్ద, చాదర్‌ఘాట్ రూట్లకు మళ్లిస్తున్నట్లు తెలిపారు.

ఉప్పల్ నుంచి జంక్షన్ నెంబర్ 6వైపు వచ్చే సిటీ ఆర్టీసీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం, ప్రేమ్ సదన్ పోలీస్ బాయ్స్ హాస్టల్, సల్ధానా గేట్, అలీ కేఫ్ క్రాస్‌రోడ్స్, గోల్నాక, నిమోబ్లియాద్దా, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తున్నారు. 6వ నెంబర్ జంక్షన్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను అనుమతిస్తారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh