Gold Rates: ఆ డేట్ తర్వాత బంగారం అమ్మరాదు

Gold Rates

Gold Rates: ఆ డేట్ తర్వాత బంగారం అమ్మరాదు

Gold Rates: గోల్డ్ షాప్ కి  వెళ్లి బంగారు నగలను కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు,  ఆ బంగారంఎలాంటిదో? స్వచ్ఛమైనదేనా? మోసం ఉండదు కదా? వంటి భయాలు వినియోదారులను వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారికి భరోసా కల్పిస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది. ఇప్పుడు వినియోగదారుల మంత్రిత్వశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ లేని ఆభరణాల విక్రయాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొంది.

హెచ్‌యూఐడీ అనేది నంబర్లు, అక్షరాలతో కూడిన 6 అంకెల కోడ్. హాల్‌మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికి ఓ ప్రత్యేకమైన హెచ్‌యూఐడీ కోడ్ కేటాయిస్తారు. దీనిని లేజర్‌తో చెక్కుతారు. ఈ నంబరు బీఐఎస్ డేటాలో భద్రపరుస్తారు. 1 జులై 2021లో తొలిసారి దీనిని ప్రవేశపెట్టారు.

హెచ్‌యూఐడీ ఆధారిత హాల్‌మార్కింగ్ వల్ల పారదర్శకత లభిస్తుంది. ఇది వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతుంది. వినియోగదారుల హక్కులను ఇది కాపాడుతుంది. ఎవరైనా సరే ఇప్పటికే ఉన్నఆభరణాలను హాల్‌మార్క్ చేయించుకుని దాని నిజమైన విలువను పొందవచ్చు .

ఇది కూడా చదవండి :

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh