ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియా తరం కాదంటూన్న : మాజీ క్రికెటర్లు

ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియా తరం కాదంటూన్న : మాజీ క్రికెటర్లు

ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియా తరం కాదంటూన్న మాజీ క్రికెటర్లు ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియా తరం కాదంటూన్న మాజీ క్రికెటర్లు టీమిండియా గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు  భారత్ లో అడుగుపెట్టే సమయానికి ఆస్ట్రేలియా జట్టు టెస్టు ర్యాంకింగ్స్ లో నెం.1 జట్టు టాప్ ర్యాంకర్ ను అనే అహంకారమో లేక గతంలో భారత్ చేతిలో ఎదురైన పరాభవాలో ఏమో కానీ వచ్చీ రాగానే భారత్ పై మాటల యుద్ధానికి ఆ దేశ మాజీ క్రికెటర్లు దిగారు. తొలి టెస్టుకు ముందే ఆస్ట్రేలియా ప్లేయర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సిరీస్ విజేత ఎవరో తేల్చేశాడు. ఈసారి ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియా తరం కాదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. అయితే తొలి టెస్టు తర్వాత ఆస్ట్రేలియా బలం ఏంటో అందరికీ తెలిసిపోయింది.

తొలి టెస్టుకు వారం రోజుల నుంచే స్పిన్ ట్రాక్ లపై ప్రాక్టీస్ చేస్తూ కనిపించిన ఆసీస్ ప్లేయర్స్ తొలి టెస్టులో బొక్క బోర్లా పడ్డారు. అయితే ఓటమికి ఆసీస్ మీడియా సాకులను వెతకడం మొదలు పెట్టింది. జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడని, స్పిన్ పిచ్ లంటూ నానా హంగామా చేసింది. ఆసీస్ మీడియాకు భారత్ ఫ్యాన్స్, మీడియా కూడా గట్టిగానే బదులిచ్చింది. ఆస్ట్రేలియాలో ఆడేప్పుడు టీమిండియా బౌన్సీ వికెట్ పై ఆడాల్సి వస్తుందని  అయితే బౌన్సీ ట్రాక్ లంటూ టీమిండియా ఎప్పుడూ ఏడ్వలేదని తన రిప్లైలో పేర్కొంది. ఇక తాజాగా ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్లు, మీడియాతో  టీమిండియాపై మరోసారి ఏడ్వడం మొదలు పెట్టింది.

అయితే ఈసారి సాకుగా అశ్విన్ రికార్డును చూపిస్తోంది. అదేంటి విచిత్రంగా ఉందనుకుంటున్నారా? అయితే  అసలు  విషయానికి వస్తే కొన్ని కారణాలతో మూడో టెస్టును ధర్మశాల నుంచి ఇండోర్ కు మార్చిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఆసీస్ ఇప్పుడు రాద్దాంతం మొదలు పెట్టింది. ఇండోర్ లో అశ్విన్ రికార్డు బాగుందని  అందుకే మ్యాచ్ వేదికగా ఇండోర్ ను సెలెక్ట్ చేశారంటూ అర్థం లేని ఏడుపు మొదలు పెట్టింది. ఒక్క ఇండోర్ లోనే కాదు టెస్టుల్లో ప్రతి గ్రౌండ్ లోనూ అశ్విన్ కు అదిరిపోయే రికార్డ్స్ ఉన్నాయి. ఆఖరికి ఆస్ట్రేలియా లాంటి చోట కూడా అశ్విన్ రాణించగలడు. ఆస్ట్రేలియా ఇలాంటి విషయాలపై కాకుండా కూర్పుపై ఆలోచించాల్సి ఉంది. ఇండియాలో స్పిన్ ట్రాక్ లు ఎదురవుతాయని తెలిసి కూడా తొలి టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో ఆడటం ఏంది. ఆ ఇద్దరు కూడా ఒకే రకమైన స్పిన్నర్లు. భిన్నమైన స్పిన్నర్లను తీసుకోవాలన్న కనీస అవగాహన కూడా లేదు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh